English | Telugu
రచ్చతో ముఠామేస్త్రీ చెర్రీ
Updated : Oct 18, 2013
"ముఠామేస్త్రీ" చిత్రం చిరంజీవికి ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు. అయితే ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు "రచ్చ" దర్శకుడు సంపత్ నంది ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే చరణ్ కోసం ఓ మంచి కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడంట సంపత్. ఈ చిత్రానికి "చోటా మేస్త్రీ" అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు తెలిసింది. దీనికి చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం "గబ్బర్ సింగ్ - 2" చిత్రం కోసం బిజీగా ఉన్న సంపత్, ఈ చిత్రం తర్వాత "చోటా మేస్త్రి" చిత్రం సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలున్నాయి.