English | Telugu

శృతినే అందరికంటే ఫేవరెట్


అటు బాలీవుడ్‌తోపాటు, తమిళ, తెలుగు చిత్ర సీమల్లో దూసుకెళ్తున్న శృతి కొత్త రికార్డు సాధించింది. సౌత్‌లో అందరికన్నా ఎక్కువ ఇష్టపడే హీరోయిన్ ఎవరంటూ నిర్వహించిన సర్వేలో శృతి మొదటి స్థానం సంపాదించుకుంది. గతంలో శృతి నటించిన చిత్రాలు అన్నీ వరుస ఫ్లాపులు అయ్యే సరికి ఈ బంగారు భామను ఇనుప పాదం అని కామెంట్ చేసుకునేవారు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత శృతి హాసన్ అదృష్టం మారిపోయింది. అప్పటి నుంచి ఈ హీరోయిన్ ఏం చేసిన కలిసి వస్తోంది.

నిరుడు ఇదే సర్వేలో 11వ స్థానంతో సరిపెట్టుకున్న శృతిహాసన్ ఈసారి 10 స్థానాల ముందుకు దూసుకుపోయింది. మొదటి స్థానంలో నిలిచింది. ఒక్క ఏడాదిలో శృతి ఇంత వేగంగా దూసుకెళ్లడం తోటి హీరోయిన్లకు కంటకింపే. ఇక ఈ పోల్ లో తమన్న రెండవస్థానంలో వుండగా, శ్రీయ, ఇలియానా, హన్సిక, నయనతార, కాజల్ మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే తెలుగు టాప్ హీరోయిన్‌ సమంత 12వ స్థానంతో సరిపెట్టకోవాల్సి వచ్చింది. శృతి ఇలా నెంబర్ వన్ స్థానాన్ని సాధించి, మిగతా హీరోయిన్లకు పెద్ద ఝలక్ ఇచ్చింది.