English | Telugu

8వసారి వస్తున్న కోటీశ్వరుడు



కెబిసి - 'కౌన్ బనేగా కరోడ్పతి' కార్యక్రమం ఎనిమిదో సీజన్ వచ్చెనెలలో ప్రారంభం కానుంది. ఆగస్టు నెలలో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్నట్టు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడీయా ద్వారా తెలిపారు. సోమవారం తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ విషయం పంచుకున్నారు. బాలీవుడ్‌లో సోషల్ మీడియాలే ఎక్కువ యాక్టివ్‌గా వుండేది అమితాబ్ బచ్చన్. అలాగే తన బ్లాగ్, ఫేస్బుక్, ట్విట్టర్.. లాంటి సామాజిక మీడియా ఖాతాల ద్వారా ఆయన అన్ని విషయాలు షేరే చేసుకుంటూ ఉంటారు.


'సరికొత్త రీతిలో ప్రసారం కానున్న కేబీసీ ఆగస్టులో ప్రారంభం అవుతుంది. 2000 సంవత్సరం నుంచి ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో ఒక్క సీజన్ మాత్రం షారుక్ఖాన్ చేశారు'' అని ఆయన పోస్ట్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది ఈ గేమ్షోకు వస్తుంటారు. వారిని ఆయన సాదరంగా ఆహ్వానించి, ప్రోత్సహిస్తుంటారు. ఇలా గడిచిన సీజన్లలో అనేకమంది ఈ కార్యక్రమం ద్వారా కోటీశ్వరులయ్యారు. ''ఈ ప్రోగ్రాంలో డబ్బు మాత్రమే కాదు.. మనసులు కూడా గెలచుకుంటారు. ఈ షోలో ప్రతీ పోటీదారు నా మనసు గెలుచుకుని వెళ్తుంటారు.. ప్రేమతో'' అని అమితాబ్ పోస్ట్ చేశారు. సోనీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ షోను ప్రసారం చేయనుంది. తెలుగులో నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి స్పూర్తి కేబిసి షోనే.