English | Telugu

మహేష్ రీమేక్ లో సోనాక్షి ...!

మహేష్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం "ఒక్కడు". మహేష్ లో ఉన్న ఒక మార్పు తెచ్చిన ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని త్వరలోనే హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇందులో మహేష్ పాత్రలో అర్జున్ కపూర్ నటిస్తుండగా, సోనాక్షి సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. "దబాంగ్","రౌడీ రాథోడ్" వంటి చిత్రాలలో నటించి, ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్ గామారిపోయిన సోనాక్షి నటించబోయే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం సోనాక్షి నటించిన "బుల్లెట్ రాజా", "రా...రాజ్ కుమార్" చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.