English | Telugu

అజిత్ పై కన్నేసిన రీమేక్ కింగ్

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయిన "పోకిరి","విక్రమార్కుడు" వంటి చిత్రాలను హిందీలో రీమేక్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు ప్రభుదేవా త్వరలో మరో చిత్ర రీమేక్ కు సన్నాహాలు చేస్తున్నాడు. తమిళంలో ఇటివలే అజిత్,నయనతార జంటగా నటించిన "ఆరంభం" చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రభుదేవా సన్నాహాలు చేస్తున్నాడు. హిందీ రీమేక్ లో అజిత్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించనున్నాడు.