English | Telugu

డిజె టిల్లు ట్వీట్ వైరల్.. బిగ్గెస్ట్ స్పాయిలర్  

-డిజె ట్వీట్ వైరల్
-అసలు ట్వీట్ లో ఏముంది!
- తెలుసు కదా ఓటిటి లోకి రెడీ


ఒరిజినల్ పేరుతో కాకుండా తన హిట్ సినిమాలోని క్యారక్టర్ పేరుతో అభిమానులు,ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించే హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఒక అరుదైన హీరో 'డిజె టిల్లు అలియాస్ సిద్దు జొన్నలగడ్డ'(Siddhu Jonnalagadda).గత నెల 17 న 'తెలుసు కదా'(Telusu kada)అనే మూవీతో థియేటర్స్ లోకి అడుగుపెట్టాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కగా టిల్లు సరసన రాశి ఖన్నా(Raashii Khanna)శ్రీనిధి శెట్టి(Srindhi Shetty)జంటగా కనిపించారు. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంది.


ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి వేదికగా సందడి చెయ్యడానికి రెడీ అవుతుంది. ఈ మేరకు నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికార ప్రకటన కూడా వచ్చింది. రీసెంట్ గా స్ట్రీమింగ్ విషయంపై టిల్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు. సదరు ట్వీట్ లో 'చిల్డ్రెన్స్ డే రోజున 'తెలుసు కదా'స్ట్రీమింగ్ కి తీసుకురావడం పెద్ద స్పాయిలర్ అని మెన్షన్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ టిల్లు అభిమానుల్లో వైరల్ గా మారింది. మరి థియేటర్స్ లో పెద్దగా ఆదరణ నోచుకోని తెలుసు కదా ఓటిటి లో ఏ మేర అదరణని అందుకుంటుందో చూడాలి.


also read: నన్ను చంపాలని చూసారు..అందుకు కారణం వాళ్ళకి తెలుసు

'తెలుసు కదా' ని ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)నిర్మించగా నీరజా కోన(Neeraja Kona)దర్శకత్వం వహించింది. అగ్ర టెక్నీషీయన్స్ అందరు 'తెలుసు కదా' కి వర్క్ చేశారు. సరికొత్త కథ, కథనాల విషయంలో మాత్రం మేకర్స్ కాంప్రమైజ్ కాలేదు.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.