English | Telugu
వీరమల్లుకి సంబంధించిన సీన్ల తొలగింపు.. అవి ఇవే
Updated : Jul 28, 2025
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)తన కెరీర్ లో ఫస్ట్ టైం 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)ద్వారా చారిత్రాత్మక జోనర్ తో కూడిన కథలో పోరాటయోధుడిగా చేసిన విషయం తెలిసిందే. గుంటూరు(Guntur)జిల్లా తెనాలి(Tenali)కి దగ్గరలో కృష్ణానది తీరాన ఉన్న కొల్లూరు(Kolluru)గనుల్లో లభించిన కోహినూర్ వజ్రం(KOhinoor Daimond)తో పాటు సనాతన దర్మం యొక్క గొప్ప తనాన్ని వీరమల్లులో చెప్పడం జరిగింది.
ఇక ఈ మూవీకి సంబంధించి కొన్ని సన్నివేశాల్లో 'విఎఫ్ఎక్స్'(Vfx)వర్క్ సరిగా లేదనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వ్యాప్తంగా పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ప్రదర్శితమవుతున్న వీరమల్లులో వీరమల్లు, అతడి అనుచరులు కొండ అంచున గుర్రాలపై స్వారీ చేస్తుంటే పెద్ద పెద్ద కొండ రాళ్ళు కిందపడుతుంటాయి. ఈ సన్నివేశాన్ని కుదించడం జరిగింది. వీరమల్లు జెండా పాతే సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారు. బాణాలని సంధించే యాక్షన్ ఎపిసోడ్ లో కూడా కుదించడంతో, క్లైమాక్స్ నిడివి తగ్గింది. ఇలా మొత్తంగా పది నుంచి పదిహేను నిమిషాల విఎఫ్ఎక్స్ ఫుటేజ్ ని తొలగించారు.
వీరమల్లు రీసెంట్ గా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. దీంతో పవన్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్టయింది. అగ్ర నిర్మాత 'ఏఎం రత్నం'(Am Rathnam)నిర్మించిన వీరమల్లుకి 'క్రిష్'(krisha),జ్యోతికృష్ణ'(Jyothi Krishna)సంయుక్తంగా దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్(Nidhhi Agerwal)హీరోయిన్ గా చెయ్యగా, బాబీ డియోల్, నాజర్, సునీల్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి(Keeravani)సంగీతాన్ని అందించాడు.