English | Telugu
మొన్న మీసాల పిల్ల.. ఇప్పుడు శశిరేఖ.. సాంగ్ ఎలా ఉంది..?
Updated : Dec 7, 2025
2026 సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీ ఇప్పటికే 'మీసాల పిల్ల' అంటూ ఫస్ట్ సింగిల్ తోనే సిక్సర్ కొట్టింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చింది.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి సెకండ్ సింగిల్ గా 'శశిరేఖ'(Sasirekha) తాజాగా విడుదలైంది. 'మీసాల పిల్ల' తరహాలోనే ఇది కూడా మెలోడీ సాంగ్. "ఓ శశిరేఖ..", "ఓ ప్రసాదు.." అంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా.. హీరో హీరోయిన్లు చిరంజీవి, నయనతార మధ్య ఎంతో అందంగా సాగింది ఈ పాట.
భీమ్స్ ట్యూన్ ఎంత వినసొంపుగా ఉందో.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ కూడా అంతే క్యాచీగా, అందరూ పాడుకునేలా ఉన్నాయి. ఇక భీమ్స్, మధుప్రియ కలిసి ఈ పాటను ఆలపించిన తీరు ఆకట్టుకుంది. లిరికల్ వీడియోలో చిరంజీవి, నయనతార కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ముఖ్యంగా చిరంజీవి యంగ్ గా కనిపించి సర్ ప్రైజ్ చేశారు. భాను మాస్టర్ సాంగ్ కి తగ్గట్టుగా క్యూట్ స్టెప్పులను కొరియోగ్రఫీ చేసి మెప్పించారు. మెగాస్టార్ తన గ్రేస్ తో ఎప్పటిలాగే మ్యాజిక్ చేశారు. మొత్తానికి 'శశిరేఖ' సాంగ్ తో 'మన శంకర వరప్రసాద్ గారు' మరో సిక్సర్ కొట్టినట్టే అని చెప్పవచ్చు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి జోడిగా నయనతార నటిస్తుండగా, ప్రత్యేక పాత్రలో విక్టరీ వెంకటేష్ కనువిందు చేయనున్నారు.