English | Telugu

రష్మిక సినిమాలో సందీప్ రెడ్డి.. ఆడియెన్స్ నవ్వుతారు!

- నటుడిగా సందీప్ రెడ్డి వంగా
- లెక్చరర్ రోల్ కోసం సంప్రదించిన డైరెక్టర్ రాహుల్
- సందీప్ రెడ్డి ఊహించని రియాక్షన్

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో టాప్ ఇండియన్ డైరెక్టర్స్ లో ఒకరిగా సందీప్ రెడ్డి వంగా పేరు పొందారు. ప్రస్తుతం ప్రభాస్ తో 'స్పిరిట్' అనే భారీ ఫిల్మ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి ఆఫ్ స్క్రీన్ లుక్స్, యాటిట్యూడ్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల్లో నటిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతూ ఉంటారు. (Sandeep Reddy Vanga)

నిజానికి 'మహానటి' సినిమాలో దర్శకుడు వేదాంతం రాఘవయ్య పాత్రలో సందీప్ రెడ్డి మెరిశారు. ఆ తర్వాత ఆయన నటన జోలికి పెద్దగా వెళ్ళలేదు. అయితే, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో వస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో ఓ రోల్ కోసం సందీప్ ను సంప్రదిస్తే.. ఆయన ఊహించని సమాధానం ఇచ్చారట. ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రివీల్ చేయడం విశేషం. (The Girlfriend)

Also Read: బాహుబలి ది ఎపిక్.. మహేష్ కొడుకు గౌతమ్ షాకింగ్ రివ్యూ!

రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫిల్మ్.. నవంబర్ 7న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్.. ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

"ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో హీరో హీరోయిన్స్ పీజీ స్టూడెంట్స్. ఇందులో ఒక లెక్టరర్ రోల్ ఉంది. ఆ క్యారెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆయనను అప్రోచ్ అయితే వద్దు, నన్ను స్క్రీన్ మీద చూడగానే ఆడియెన్స్ నవ్వుతారు అని రిజెక్ట్ చేశారు. చివరకు ఆ రోల్ నేనే చేయాల్సి వచ్చింది." అని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చారు.

రాహుల్ రవీంద్రన్ చెప్పినట్టుగా 'ది గర్ల్ ఫ్రెండ్'లో సందీప్ రెడ్డి ఆ లెక్టరర్ రోల్ చేస్తే.. సినిమాపై మరింత హైప్ వచ్చేది అనడంలో సందేహం లేదు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.