English | Telugu
ఆమె కళ్ళల్లో ఆగ్రహం, నడకలో హుందాతనం.. ఏం సెట్ చేశావయ్యా పూరి
Updated : Jun 17, 2025
'మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి'(Vijay sethupathi), పూరి జగన్నాధ్(Puri Jagannadh)కాంబోలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. 'బిక్షామ్ దేహి' అనే టైటిల్ ప్రచారంలో ఉండగా, పూరి జగన్నాధ్ ,ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నటించే మిగతా నటీనటుల్ని మేకర్స్ ఒక్కొరిగా పరిచయం చేస్తుంది. ఇప్పటికే సీనియర్ నటీ టబు తమ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తుందని వెల్లడి చెయ్యడంతో పాటు ఆమెతో పాటు దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఇప్పుడు ఈ మూవీలో ప్రముఖ హీరోయిన్ 'సంయుక్త మీనన్'(Samyuktha Menon)చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు 'ఎక్స్'(X)వేదికగా పోస్ట్ చేస్తూ 'ఆమె కళ్ళల్లో ఆగ్రహం, నడకలో హుందాతనం అనే క్యాప్షన్ తో పాటు సంయుక్త మీనన్ తో కలిసి పూరి, ఛార్మి దిగిన ఫోటోని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్ పరంగా కూడా అందరిలో ఆసక్తిని కలగచేస్తుంది. మళయాళచిత్ర పరిశ్రమకి చెందిన సంయుక్త మీనన్ 2016 లో సినీ రంగ ప్రవేశం చేసి, పలు మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది.
2022 లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)రానా కలిసి చేసిన 'భీమ్లానాయక్' ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యి, విరూపాక్ష, సార్, బింబిసార, డెవిల్ వంటి చిత్రాల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో స్వయంభూ, అఖండ 2 , హైందవ, నారి నారి నడుమ మురారి వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
