English | Telugu

నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి.. కంటతడి పెట్టిస్తున్న సంపత్ నంది పోస్ట్!

టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సంపత్ తండ్రి నంది కిష్టయ్య మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు.

తండ్రి మరణంతో ఎంతో బాధలో ఉన్న సంపత్ నంది.. ఆ బాధను అక్షరాలుగా మలిచి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుండె నిండా బాధతో, తడిచిన కళ్ళతో, వణుకుతున్న చేతితో రాసిన ఆ పోస్ట్.. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించేలా ఉంది. (Sampath Nandi)

"బాపు.. నువ్ లేకుండానే ఇక రేపు, ఎల్లుండి, జీవితమంతా..
నువ్ లేకుండానే తెల్లారింది..
నువ్ లేకుండానే ఓదెల లేచింది..
నువ్ లేకుండానే ఇల్లూ లేచింది.
కల్లాపి తో తడవాల్సిన వాకిలి కన్నీళ్ళతో తడిచింది..
“ఎట్లున్నవ్” అని అడగాల్సిన మనుషులు..
“ఎట్ల పోయాడు” అని అడుగుతున్నారు
ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులు విని నీ గుండె మళ్లీ కదిలితే ఎంత బావుండు!
చిన్నప్పుడు జబ్బు చేస్తే ఆయుర్వేద వైద్యం కోసం భుజంపై 10km ఎత్తుకెళ్లింది మొన్నే కదా అనిపిస్తోంది..
గంగుల కనకయ్య చుక్కల థియేటర్ లో నన్ను ఖైదీ సినిమాకు పంపించింది నెన్నే కదా అనిపిస్తోంది..
నువ్ నేర్పిన ఎడ్ల బండి నడక..
మనం దున్నిన జంబు అరక..
పత్తి మందుకు పంపు..
పల్లి చేను లో సద్ది..
మిరప నారుతో నాటు.. బురద పొలం లో జలగల తో పాట్లు..
ఇక అన్నీ జ్ఞాపకాలేనా?
దసరాకు నేనొస్తున్నానని తెలియగానే రాపు దగ్గర నీ ఎదురుచూపులు..
మేమొచ్చామని బగార, నీర కల్లు ఏర్పాట్లు..
ఏ సినీ అభిమాని ఇంటికొచ్చినా నా ఫోన్ నంబరిచ్చి ఇచ్చి మావోడి దగ్గరికెళ్లమని నువ్వు ఇచ్చే ప్రోత్సాహం.. ఇక అన్నీ గుర్తులేనా?
ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప వేరే ఏ సినిమా థియేటర్ లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి..
నీకు నలుగురు పిల్లలున్నారు.. వాళ్ళకీ పిల్లలున్నారు.. ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో..
కానీ మళ్లీ రా.."

- సంపత్ నంది

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.