English | Telugu
నేను ఆ సినిమా చూడలేదు: సమంత
Updated : Jul 4, 2014
‘నేను ఇంకా ఆ సినిమా చూడలేదు, కానీ అందరూ ఆ సినిమా చాలా బాగుంది అంటున్నారు. అటువంటి సినిమాలు మరెన్నో రావాలి అంటున్నారు’ అంటూ ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంపై స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసల వర్షం కురిపించేస్తోంది. సాయి కొర్రపాటి నిర్మాణ సారధ్యంలో శ్రీని అవసరాల తెరకెక్కించిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం సమంతను సైతం ఆకట్టుకొంది. సాయి కొర్రపాటి ఇంతకుమునుపు సమంతతో ‘ఈగ’ వంటి బ్లాక్‌బస్టర్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ సినిమాకి అభినందనలు తెలిపిన సమంతకు సాయి కొర్రపాటి కృతజ్ఞతలు తెలిపారు!