English | Telugu

రంభ గురించి రాయకండి - కుష్భూ


రంభ హ్యాప్పీగా వుంది. తన గురించి ఇలా తప్పుడు రాతలు రాయకండి అంటూ కుష్భూ గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. రంభ పెళ్లి చేసుకుని కెనడాలో నివాసం వుంటోంది. భర్త ఇంద్రకుమార్, పాప లాస్యతో హాయిగా కెనెడాలో కాపురం చేసుకుంటున్న
రంభ విడాకులు తీసుకోబోతోందంటూ గాసిప్స్ మొదలయ్యాయి. ఈ విషయంలో రంభ కంటే ఘాటుగా కుష్భూ స్పందించారు.

ఈ మధ్యనే కెనడాకు వెళ్లిన కుష్భూకు రంభ చక్కటి ఆతిథ్యం ఇచ్చిందట. అక్కడి నయగారా జలపాతాలను చూడటానికి రంభ కుటుంబంతో కలిసి వెళ్లారట కుష్బూ. రంభ, ఇంద్ర కుమార్ లాంటి చక్కటి జంట గురించి ఇష్టం వచ్చినట్లు రాయటం ఇకనైనా ఆపాలని కుష్భూ ట్విట్టర్ ద్వారా గట్టిగానే సూచించారు. తప్పుడు విషయాలు రంభ గురించి రాస్తే మంచిది కాదని కుష్బూ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి మన గాస్సిప్ కింగ్స్ ఇంకోకరిని వెతుక్కుంటారేమో...