English | Telugu
సమ్‌థింగ్.. సమ్‌థింగ్ "సమంత"
Updated : Jun 11, 2013
సమంతకు తనకూ మధ్య "సమ్‌థింగ్.. సమ్‌థింగ్" నడుస్తోందనే విషయాన్ని హీరో సిద్దార్ధ్ పరోక్షంగానే అంగీకరిస్తున్నారు. "సమ్‌థింగ్.. సమ్‌థింగ్" ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకొంటున్న సిద్దార్ధ్.. పై విషయమై తనను ప్రశ్నిస్తున్న మీడియాకు ముసిముసి నవ్వులతో సమాధానమిస్తుండడమే ఇందుకు నిదర్శనం.
ఈనెల 14న విడుదలవుతున్న "సమ్‌థింగ్.. సమ్‌థింగ్" చిత్రంలో సమంత ప్రత్యేక అతిధి పాత్ర పోషించినట్లుగా వస్తున్న వార్తల్ని కూడా సిద్దార్ధ ఖండించడం లేదు. దగ్గుబాటి రానాతోపాటు ఓ ప్రముఖ హీరోయిన్ ప్రత్యేక అతిధి పాత్ర పోషించిందంటూ దర్శకనిర్మాతలు ప్రకటించినప్పటినుంచి.. ఆ ప్రముఖ హీరోయిన్.. సమంతానే అయ్యుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
"సమ్‌థింగ్.. సమ్‌థింగ్" చిత్రంలో సమంత నటించడం నిజమే అయితే.. సిద్దార్ధ్_సమంతల నడుమ "సమ్‌థింగ్.. సమ్‌థింగ్" నడుస్తోందనేది వాస్తవమేనని నిర్దారణ అయిపోతుంది!