English | Telugu

రెబల్ సాబ్ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ ఇదే.. మరి ఫ్యాన్స్ ఏమంటారో 


-రెబల్ సాంగ్ ఎలా ఉంది!
-ప్రభాస్ మానియా స్టార్ట్ అయ్యిందా!
-సాహిత్యం అర్ధమవుతుందా!
-కొత్త ప్రభాస్ కనిపిస్తున్నాడు

ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళయ్యింది. ప్రభాస్(Prabhas)ని వింటేజ్ ప్రభాస్ గా చూసి. మా కడుపు నిండి పోయింది. ఇక రికార్డులే తరువాయి. ఆ రికార్డులు ఇండియన్ చిత్రసీమలో శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. ప్రభాస్ అభిమానుల ఆ కామెంట్స్ తో సోషల్ మీడియా కళకళలాడుతు ఉంది. ఇందుకు కారణం 'దిరాజా సాబ్'(The Raja Saab)నుంచి నిన్న నైట్ రిలీజైన 'రెబల్ సాబ్, రొమాంటిక్ రెబల్ సాబ్' అనే లిరిక్స్ తో కూడిన సాంగ్. కేవలం పద్నాలుగు గంటల్లోనే 8 .3 మిలియన్ల వ్యూస్ ని పైగా సాధించి ప్రభాస్ స్టామినా ని కూడా తెలియచేస్తుంది.


ఇక సాంగ్ విన్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఎంటైర్ ప్రభాస్ కెరీర్ లోనే ఇప్పటి వరకు రాని విధంగా సాంగ్ తెరకెక్కినట్టుగా అర్ధమవుతుంది. ప్రభాస్ డాన్స్ మూమెంట్స్ కొత్త తరహాగా ఉన్నాయి.సాంగ్ లో ప్రభాస్ అప్ కమింగ్ మూవీ స్టిల్స్ చూపించడంతో పాటు పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచులర్ నేనే అని చెప్పడం మెస్మరైజ్ గా ఉంది. పాన్ ఇండియా బ్యాచులర్ నే కాదు, పాన్ ఇండియా నెంబర్ వన్ హీరో కూడా మా ప్రభాస్ నే. రేపు థియేటర్స్ లో సదరు సాంగ్ కి మాములు హంగామా ఉండదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

also read:ఈ నెల 28 న ఏం జరగబోతుంది! లవ్ సింబల్ స్క్రీన్ షాట్ వైరల్

పాటల ప్రేమికులు కూడా స్పందిస్తు రెబల్ సాబ్ సాంగ్ చాలా బాగుందని, ఫాస్ట్ బీట్ లో ట్యూన్ సాగినా రామజోగయ్య గారి సాహిత్యం క్లియర్ గా అర్థమవుతుందనే కామెంట్స్ చేస్తున్నారు. థమన్, సంజిత్ హెగ్డే, బ్లేజ్ ఆలపించగా సాంగ్ నిడివి ముడునిమిషాల ముప్పై సెకన్లు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ ప్రభాస్ తో జతకట్టగా మారుతీ(Maruthi)దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జి విశ్వప్రసాద్(TG Vishwaprasad)సుమారు 450 కోట్ల బడ్జెట్ తో రాజాసాబ్ ని వచ్చే ఏడాది జనవరి 9 న పాన్ ఇండియా ఫిలింగా తీసుకొస్తున్నాడు.