English | Telugu
'RC 16' అప్పటి నుంచే షురూ.. మరో స్టార్ హీరో కూడా
Updated : Aug 19, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచి తూచి అడుగులేస్తున్నారు. RRR సినిమా తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాను స్టార్ట్ చేసిన ఆయన శంకర్ కి అనుగుణంగా సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఆ సినిమా ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నాటికంతా పూర్తవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని తర్వాత రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని కూడా సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ తన 16వ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ మూవీగా సినిమా వస్తుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రను RC 16లో చేస్తారని సినీ సర్కిల్స్ అంటున్నాయి. అది కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవేంటంటే.. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ మూవీ జనవరి నుంచి మొదలవుతుందట. ఇప్పటికే మేకర్స్ ఆఫీసుని కూడా తీసుకున్నారట. గేమ్ ఛేంజర్ పూర్తయిన తర్వాత చరణ్ తన 16వ సినిమాపై దృష్టి పెట్టబోతున్నారు.
దీంతో పాటు RC 16కి సంబంధించి మరో వార్త కూడా నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని సంప్రదించారట. అయితే దీనిపై సదరు వెర్సటైల్ ఆర్టిస్ట్ డెసిషన్ మాత్రం చెప్పలేదు. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతిని బుచ్చి బాబు తెరపై ఆవిష్కరించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు మరోసారి తనకు అచ్చొచ్చిన యాక్టర్ ని రంగంలోకి దింపాలని బుచ్చి బాబు ప్లాన్ చేసుకున్నారు. కానీ చివరకు ఏమవుతుందో తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.