English | Telugu
ఓటీటీలో 'భీమదేవరపల్లి బ్రాంచి'కి సూపర్ రెస్పాన్స్
Updated : Aug 19, 2023
రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిత్రం 'భీమదేవరపల్లి బ్రాంచి'. మైత్రి మూవీస్ ద్వారా జూన్ 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకధారణ పొందింది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా మంచి ఆదరణ పొందుతోంది.
'భీమదేవరపల్లి బ్రాంచి' సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నేటివిటీ సినిమాల్ని ఇష్టపడుతున్న నేటి ప్రేక్షకులకి ఈ సినిమా పల్లె ప్రజల జీవన విధానాన్ని, అమాయకత్వాన్ని ,సంస్కృతిని, సంఘర్షణని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. భీమదేవరపల్లి బ్రాంచిలో బలమైన కథ ఉంది. రాజకీయ నాయకుల తప్పుడు వాగ్దానాలు నమ్మి ప్రజలు ఎలా అవస్థలు పడతారో దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఉచిత పథకాల మీద దర్శకుడు తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ఉచితాలు అసలు ఉచితాలే కాదు.. అవి మరోరకంగా మన మీద వేసే భారాలు", "ప్రభుత్వాలు పని కల్పించాలి కానీ ప్రజలకు పైసలు ఇవ్వకూడదు" అంటూ రచయిత -దర్శకుడు రమేష్ చెప్పాల తన సామాజిక స్పృహని దృశ్యరూపంగా మార్చారు. సమాజాన్ని మేల్కొల్పే కథాంశమే అయినప్పటికీ ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది ఈ చిత్రం.