English | Telugu
మాస్ రాజాతో జోడి కట్టనున్న హన్సిక
Updated : Sep 20, 2013
"బలుపు" చిత్రం తర్వాత రవితేజ హీరోగా త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రం ద్వారా రచయిత బాబీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. "బాడీగార్డ్", "డాన్ శీను", "బలుపు" చిత్రాలకు రచయితగా పనిచేసిన బాబీ.. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా హన్సిక ను ఎంపిక చేసుకున్నారు. రవితేజ, హన్సిక మొదటిసారి ఈ చిత్రంలో కలిసి నటించబోతున్నారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.