English | Telugu
ఆట, పాటలతో వస్తున్న రామయ్య
Updated : Sep 19, 2013
యంగ్ టైగర్ ఎన్టీఅర్ హీరోగా నటించిన తాజా చిత్రం "రామయ్యా వస్తావయ్యా". హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను ఈ నెల 21న విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సూపర్ హిట్టయ్యింది. యూత్ కు కిక్కేకించే పాత్రలో అదరగొట్టడానికి వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఅర్ సరసన సమంత, శృతి హాసన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టీఅర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఈ చిత్రం ఓ పండగ కానుంది. మరి ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని కోరుకుందాం.