English | Telugu

బాలీవుడ్ లోకి యముడి కూతురు

అల్లరి నరేష్ హీరోగా నటించిన "యముడికి మొగుడు" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రిచా పనాయ్. ఈ చిత్రంలో యముడి కూతురిగా చాలా చక్కగా నటించి, మంచి మార్కులే సంపాదించింది. కానీ ఈ చిత్రం తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయనుకున్న ఈ అమ్మడి ఆశ నిరాశగానే మిగిలిపోయింది. తెలుగులో ఏ ఒక్క సరైన అవకాశం రాక వేరే ఇండస్ట్రీ పై కన్నేసింది. అయితే ఈ అమ్మడు త్వరలోనే బాలీవుడ్ లో నటించబోతుంది. మలయాళంలో సూపర్ హిట్టయిన "ట్రాఫిక్" చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రంలో నటించడానికి చాలా సంతోషంగా ఉందని, ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచుస్తున్నానని రిచా తన మనసులోని మాట తెలిపింది. మరి ఈ చిత్రం రిచాకు ఎలాంటి బ్రేక్ ను ఇస్తుందో చూడాలి.