English | Telugu

ప్రభాస్ తో సంథింగ్ స్పెషల్.. మహేష్ గురించి ఆ సీక్రెట్..!

పుష్ప, యానిమల్, ఛావా వంటి సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది రష్మిక మందన్న. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఈ నవంబర్ 7న 'ది గర్ల్‌ఫ్రెండ్‌'తో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రష్మిక.. తాజాగా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో భాగంగా స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబుపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Rashmika Mandanna)

ప్రజెంట్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రష్మిక.. ఇంకా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో కలిసి నటించలేదు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశముందా? అని అడిగాడు.

"ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి వర్క్ చేసే అవకాశముందా. ఒకవేళ అది జరిగితే థియేటర్ దగ్గర నా బాడీ కలెక్ట్ చేసుకో రషు" అంటూ హైప్ తో చనిపోయినట్టుగా ఉన్న బ్రహ్మానందం ఫొటో మీమ్ ని ప్రభాస్ అభిమాని పోస్ట్ చేశాడు. దీనికి రష్మిక ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. "ఇది నాకు నచ్చింది. ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే, మేమిద్దరం త్వరలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేస్తామని కూడా ఆశిస్తున్నాను" అని రష్మిక రాసుకొచ్చింది.

Also Read: ప్రభాస్ 'ఫౌజీ' సర్ ప్రైజ్.. బిగ్ లీక్ ఇచ్చిన సుధీర్ బాబు!

"మహేష్ బాబులో మీకు నచ్చిన ఒక విషయం ఏమిటి?" అని ఓ అభిమాని అడగగా.. దానికి కూడా రష్మిక భలే సమాధానం ఇచ్చింది. "సర్ ఎప్పటికీ యంగ్ గా కనిపిస్తారు. అసలు వయసు అయిపోదు. ఇంకా వయసు వెనక్కి తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. నాకు అది చాలా ఇష్టం. అసలది ఎలా సాధ్యమో తెలుసుకోవాలనుకుంటున్నాను." అని రష్మిక రిప్లై ఇచ్చింది.

ప్రభాస్, మహేష్ గురించి రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.