English | Telugu

Rana Daggubati: మొన్న మెగా.. నేడు దగ్గుబాటి.. గుడ్ న్యూస్ చెప్పిన రానా!

ఇటీవల మెగా అభిమానులకు ఓ శుభవార్త అందింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. చరణ్-ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం. (Rana Daggubati)

ఇక ఇప్పుడు దగ్గుబాటి అభిమానుల వంతు వచ్చింది. రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. రానా సతీమణి మిహీక ప్రెగ్నెంట్ అని వార్తలొస్తున్నాయి. అంటే త్వరలోనే దగ్గుబాటి ఇంటికి వారసుడో వారసురాలో రాబోతున్నారన్నమాట.

విభిన్న పాత్రలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రానా.. నిర్మాతగా, హోస్ట్ గానూ తనదైన ముద్ర వేస్తున్నాడు. బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నాడు. కాగా, రానా-మిహీక వివాహం 2020లో జరిగింది.