English | Telugu

రామ్‌ ‘పండగచేస్కో’ న్యూలుక్ ఫోటో

టాలీవుడ్ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘పండగచేస్కో’. ఈ సినిమా షూటింగ్ నాన్‌స్టాప్‌గా జరుగుతున్నట్లు దర్శకుడు తెలియజేశారు. ఈ చిత్రంలో రామ్‌ లుక్ నూ మీడియాకు రిలీజ్ చేశారు. రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టుగా ఫుల్‌ లెంగ్త్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. సెప్టెంబర్‌లో అమెరికా షెడ్యూల్‌తో పాటు నవంబర్‌ 15 వరకు జరిగే షూటింగ్‌తో టోటల్‌గా సినిమా కంప్లీట్‌ అవుతుందని అన్నారు.