English | Telugu

చెర్రీ గోవిందుడు అందరివాడేనా..!

చిరంజీవి హీరోగా "అందరివాడు" అనే చిత్రం తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు గోవిందుడు పాత్రలో కనిపించడమే కాకుండా... "గోవిందుడు అందరివాడు..." అంటూ ఒక పాట కూడా వేసుకున్నాడు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన "బృందావనం" సినిమాకు "గోవిందుడు అందరివాడేలే" అనే క్యాప్షన్ పెట్టుకున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఒక స్టైలిష్ చిత్రంగా "బృందావనం" నిలిచింది.

అయితే ప్రస్తుతం ఈ గోవిందుడు పేరును చిరు తనయుడు చరణ్ కూడా వాడుకుంటున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు "గోవిందుడు అందరి వాడేలే" అనే టైటిల్ ను ఖరారు చేసారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. ఈనెల 26 నుంచి హైదరాబాద్ లోని రామానాయుడు సినీవిలేజ్ లో సెట్ వర్క్ కూడా మొదలు పెట్టనున్నారు. ఇందులో చరణ్ అన్న పాత్రలో నటుడు శ్రీకాంత్ నటించనున్నాడు. చరణ్ కు జోడిగా మూడోసారి కాజల్ అగర్వాల్ జతకట్టనుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది.