English | Telugu
మహేష్ 1 పాటలు తొలగిస్తున్నారు.
Updated : Jan 21, 2014
మహేష్ నటించిన "1" చిత్రం విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంటుంది. స్పందన ఎలా ఉన్నప్పటికీని కూడా సినిమా చాలా ఇంటర్ నేషనల్ స్టాండర్డ్ లో ఉందని, అందుకే "1" ను అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు పంపనున్నట్లు దర్శకుడు సుకుమార్ తెలిపారు. "1" ను అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించడం కోసం ఇందులోనే పాటలను తొలగించబోతున్నట్లు సుకుమార్ తెలిపారు. ఈ సినిమా ఖచ్చితంగా అవార్డులను సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే సినిమా నిడివి ఎక్కువ అవడంతో 20నిముషాలు తగ్గించిన విషయం అందరికి తెలిసిందే. మరి పాటలు లేకుండా కేవలం సినిమాను అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించి, దర్శకుడు ఎలాంటి అవార్డులు రాబట్టుతాడో త్వరలోనే తెలియనుంది.