English | Telugu

'రాజు వెడ్స్ రాంబాయి' అసలు కలెక్షన్స్ ఇవే..!

'రాజు వెడ్స్ రాంబాయి'కి షాకింగ్ కలెక్షన్స్
బడ్జెట్ రెండు కోట్లు
నాలుగు రోజుల్లో వచ్చింది ఎంతంటే..?

ఒక్కోసారి బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాలు సర్ ప్రైజ్ చేస్తుంటాయి. రీసెంట్ గా విడుదలైన 'రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambai) గురించి ప్రస్తుతం తెగ చర్చ జరుగుతోంది. ఈ సినిమా సంచలన వసూళ్ళతో దూసుకుపోతోంది అంటున్నారు. అసలు ఈ 'రాజు వెడ్స్ రాంబాయి' కలెక్షన్స్ నిజంగా ఆ రేంజ్ లో ఉన్నాయా?

'లిటిల్ హార్ట్స్' తర్వాత ఈటీవీ విన్ నుండి వచ్చిన చిత్రం 'రాజు వెడ్స్ రాంబాయి'. అఖిల్ రాజ్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సుమారుగా రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వీకెండ్ లోనే ఈ సినిమా రూ.7.28 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది.

ముఖ్యంగా తెలంగాణలో ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ.. ఒక్క నైజాం ఏరియాలోనే ఫస్ట్ వీకెండ్ లో రూ.5 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం.

Also Read: ధర్మేంద్ర ప్రస్థానం.. 19 ఏళ్ళకు మొదటి పెళ్ళి.. 50 రూపాయలు మొదటి సంపాదన!

చాలా సినిమాలు మొదటి వీకెండ్ పూర్తయ్యి, సోమవారం రాగానే స్లో అవుతుంటాయి. కానీ, 'రాజు వెడ్స్ రాంబాయి' మాత్రం డిస్టింక్షన్ లో మండే టెస్ట్ పాస్ అయింది. సోమవారం ఒక్క బుక్ మై షో యాప్ లోనే దాదాపు 29 వేల టికెట్లు బుక్ అయ్యాయి.

'రాజు వెడ్స్ రాంబాయి' మొదటి నాలుగు రోజుల్లో రూ.9.08 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొదటి రోజుతో పోలిస్తే, నాలుగో రోజు ఎక్కువ కలెక్ట్ చేయడం విశేషం. ఇదే జోరు కొనసాగితే.. ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర మరిన్ని సంచలనాలు సృష్టించేలా ఉంది.

రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిన్న సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం నిజంగా గొప్ప విషయమే. పైగా ఇప్పటిదాకా మెజారిటీ కలెక్షన్స్ తెలంగాణ నుండే వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ లోనూ సినిమా ఊపందుకుంటోంది. తెలంగాణ జోరుకి ఏపీ కూడా తోడైతే.. ఈ చిత్రం రికార్డు వసూళ్లు రాబట్టడం ఖాయం.

'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ టీమ్ అయితే ఫుల్ రన్ లో రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదు అంటోంది. మరి అది సాధ్యమవుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.