English | Telugu

సంగీత దర్శకుడిగా పూరీ జగన్నాథ్

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సంగీత దర్శకుడిగా కూడా మారబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఇడియట్, ఔను వాళ్ళిద్దరూ ఇష్తపడ్డారు, పోకిరి వంటి సూపర్ హిట్లిచ్చిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ త్వరలో సంగీత దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలనుకుంటున్నారు. దీని కోసం తన తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా, తన అసోసియేట్ గోపీ దర్శకత్వంలో ఒక సినిమాని నిర్మిస్తూ, ఆ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాలనుకుంటున్నారట. దర్శక,

నిర్మాత పూరీ జగన్నాథ్ కు సంగీతంలో చక్కని అభిరుచి ఉన్నదనేది అందరికీ తెలిసిందే. అందుకే తానే సంగీతం ఎందుకు అందించకూడదని ఆయన ఆలోచనట. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ప్రథాన పాత్రలో నటిస్తూండగా, ఛార్మీ తదితరులు నటిస్తున్న "బుడ్డా" క్యాప్షన్ "హోగా తేరా బాప్" అనే బాలీవుడ్ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.