English | Telugu

ఏప్రెల్ 12 న సిద్ధార్థ 180 మూవీ ఆడియో రిలీజ్

ఏప్రెల్ 12 న సిద్ధార్థ 180 మూవీ ఆడియో రిలీజ్ చేయబడుతుందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే సిద్ధార్థ హీరోగా, నిత్యా మీనన్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా, యాడ్ ఫిలిం మేకర్ జయంత్ దర్శకత్వంలో నిర్మించబడుతున్న చిత్రం"180". ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న జయంత్ పూర్వాశ్రమంలో కొన్ని వందల యాడ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ "180" చిత్రానికి ఫేంటమ్ ఫ్లెక్స్ కెమెరాని ఉపయోగిస్తున్నారు.

ఈ కెమెరాతో మైక్రో సెకండ్ లో కనిపించే భావాలను కూడా చాలా క్లియర్ గా చిత్రీకరించవచ్చు. ఈ కెమెరాని తొలిసారిగా ఈ చిత్రంలోనే ఉపయోగించటం విశేషం. ఈ చిత్రం యొక్క ఆడియోని ఏప్రెల్ 12 వ తేదీన మార్కెట్ లోకి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట. ఒక విభిన్నమైన కథతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మాత్రం వేసవి కాలంలో "మే" నెలలో విడుదల చేయనున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.