English | Telugu

అల్లరి నరేష్ న్యూ మూవీ సీమటపాకాయ్

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీకి "సీమటపాకాయ్" అన్న పేరుని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే అల్లరి నరేష్ హీరోగా, పూర్ణ అనే కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో విశాఖపట్టణం యమ్.యల్.ఎ. డాక్టర్ మళ్ళ విజయప్రసాద్ తన వెల్ ఫేర్ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న మూడవ చిత్రానికి "సీమటపాకాయ్" అన్న పేరుని నిర్ణయించారు.


ఈ చిత్రం టైటిల్ లోగోని, ఏప్రెల్ రెండవ తేదీన, హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్.యన్.సి.సి.)లో ఈ "సీమటపాకాయ్" చిత్రం హీరో అల్లరి నరేష్, నిర్మాత డాక్టర్ మళ్ళ విజయప్రసాద్ ఇద్దరూ సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం ఈ చిత్రంలో నటించిన జయప్రకాష్ రెడ్డి, యల్.బి.శ్రీరామ్, జీవా తదితరులు ఈ చిత్రం షూటింగ్ లో తమ అనుభవాలను, ఈ చిత్రం యూనిట్ తో తమకున్న అనుబంధాన్ని సవివరంగా మీడియాకు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతాన్ని వందేమాతరం శ్రీనివాస్ అందిస్తూండగా, కృష్ణారెడ్డి కొరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.