English | Telugu
నటుడు వడ్డే నవీన్ తండ్రి మృతి
Updated : Nov 21, 2013
ప్రముఖ నటుడు వడ్డే నవీన్ తండ్రి అయిన ప్రముఖ సినీ నిర్మాత వడ్డే రమేష్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో మృతి చెందారు. గతకొద్ది కాలంగా రమేష్ క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్నారు. అయితే పరిస్థితి విషమించటంతో.. ఆయన గురువారం తుది శ్వాస విడిచారు. రమేష్ కు ఇద్దరు సంతానం. కొడుకు వడ్డే నవీన్. కూతురు కోయంబత్తూరు లో ఉంటుంది. రమేష్ తెలుగు, హిందీ బాషలలో దాదాపు 30 చిత్రాలు తెరకెక్కించారు. "బొబ్బిలి పులి" చిత్రం ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చింది. శుక్రవారం ఎర్రగడ్డలో రమేష్ అంత్యక్రియలు జరుగుతాయి.