English | Telugu

డిసెంబర్ 6న తలైవా ఆట ఆరంభం

విడుదలైన రోజు నుండి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న తమిళ చిత్రం "ఆరంభం". అజిత్, నయనతార, ఆర్య, తాప్సీ కలిసి నటించిన ఈ సినిమా ఇటివలే తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టుని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో "ఆట ఆరంభం" పేరుతొ డబ్బింగ్ చేసి, డిసెంబర్ 6వ తేదిన విడుదల చేయనున్నారు. ఈనెల చివర్లో పాటలు విడుదల చేయనున్నారు. విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. మరి తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.