English | Telugu
జీన్స్ సీక్వెల్ కు రంగం సిద్ధం...!
Updated : Nov 21, 2013
ప్రశాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జీన్స్". 1998 లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ తెరకెక్కనుందని తెలుస్తుంది. ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఈ సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిసింది. ఇటివలే చెన్నై ఫిల్మ్ చాంబర్ లో"జీన్స్-2" అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.