English | Telugu

ఐబొమ్మ రవి కంటే పెద్ద దొంగలు వాళ్లే.. సినిమా పైరసీకి బాధ్యులు వాళ్లే!

గత కొన్నిరోజులుగా సినిమా పైరసీ గురించి, ఐబొమ్మ రవి అరెస్టు గురించి మీడియాలో, సోషల్‌ మీడియలో విపరీతమైన చర్చ జరుగుతోంది. సినిమా పైరసీకి ఎవరు కారణం అనే విషయంలో రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. ఐబొమ్మ రవిని అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఫిలింఛాంబర్‌లోని ప్రముఖులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీస్‌ శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు పైరసీ అనే సమస్యను పలు కోణాల్లో వివరించే ప్రయత్నం చేశారు.

‘గత కొన్ని సంవత్సరాలుగా ఐబొమ్మ అనే వెబ్‌సైట్‌ ద్వారా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు పైరసీకి గురవుతున్న విషయం తెలిసిందే. సినిమాలను స్క్రీనింగ్‌ చేసే క్యూబ్‌, యుఎఫ్‌ఓల ద్వారానే పైరసీ జరుగుతోంది. కొన్ని వేల సినిమాలు ఐబొమ్మలోకి వెళ్ళడానికి కారణం కూడా అదే. క్యూబ్‌, యుఎఫ్‌ఓ సంస్థలు పాతకాలం నాటి సర్వర్లు ఉపయోగించడం వల్ల పైరసీదారులకు అందులో నుంచి కంటెంట్‌ని రాబట్టుకోవడం ఈజీ అయిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ రవి గురించి మరో విషయం చెప్పాలి. పుష్ప2 తన దగ్గరకు వారం ముందే వచ్చినప్పటికీ వెంటనే దాన్ని అప్‌లోడ్ చెయ్యకుండా ఆగాడట. అతను ముందే రిలీజ్ చేసి ఉంటే ఫైనాన్సియర్లు, నిర్మాతలు, అడ్వాన్సులు ఇచ్చిన ఎగ్జిబిటర్లు అంతా ఏమైపోయేవారు. అందుకే అతన్ని మంచి దొంగ అంటాను.

పైరసీ విషయంలో అసలైన దొంగలు క్యూబ్‌, యుఎఫ్‌ఓ సంస్థలే. అంతేకాదు, అక్కడి నుంచే పైరసీ అవుతోందని తెలిసి కూడా మాట్లాడకుండా ఉన్న సినిమా ప్రముఖులు అందరి కంటే దొంగలు అని నా ఉద్దేశం. అసలు ప్రేక్షకులు ఐబొమ్మ వైపు వెళ్లడానికి, అక్రమంగా ఆ వెబ్‌సైట్‌ నుంచి సినిమాలు చూడడానికి ప్రధాన కారణం.. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న నిర్మాతలే. ఎందుకంటే వందల కోట్లు బడ్జెట్‌ పెట్టి అందులో 90 శాతం రెమ్యునరేషన్ల కింద కొందరికి ఇచ్చేస్తున్నారు. కేవలం 10 శాతం మాత్రమే ప్రొడక్షన్‌కి ఖర్చు చేస్తున్నారు.

సినిమా చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఎక్కువ బడ్జెట్‌తో చేసిన సినిమాలు కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్‌ చేసే ఉద్దేశంతో భారీ బడ్జెట్‌లతో సినిమాలు చేసి ఆ భారమంతా సామాన్య ప్రేక్షకులపై వేస్తున్నారు కొందరు నిర్మాతలు. అంతేకాదు, సాధారణంగా ఉన్న టికెట్‌ ధరలను అసాధారణ స్థాయికి తీసుకెళ్లిపోయి ప్రేక్షకులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. అందుకే ఫ్రీగా వస్తుంది కదా అని పైరసీలో సినిమాలు చూసేస్తున్నారు. ఈ విషయంలో ఇకనైనా నిర్మాతలు పునరాలోచన చేయాలి’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.