English | Telugu

ప్రియాంక మోహన్ మరి ఇంత అసభ్యకరమా! ఓజి హిట్ అయితే ఇలాగే ఉంటుంది   

ప్రియాంక మోహన్(Priyanka MOhan)తన కెరీర్ కి సంబంధించిన అతిపెద్ద బ్రేక్ కోసం సుమారు ఆరు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తు వస్తుంది. ఆ ఎదురుచూపులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(OG)ద్వారా ఫలించాయి. ఓజాస్ గంభీర్ వైఫ్ కణ్మణి క్యారక్టర్ లో ప్రియాంక ప్రదర్శించిన సెటిల్డ్ పెర్ ఫార్మెన్సు ప్రతి ఒక్కర్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. పైగా ఓజి ఘన విజయాన్ని సాధించడమే కాకుండా పవన్ కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ ని సృష్టించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఇప్పుడు ప్రియాంక మోహన్ పేరు తెలుగుతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా మారుమోగిపోతుంది. పలు భారీ చిత్రాలలో కూడా ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది.

రీసెంట్ గా నెట్టింట ప్రియాంక కి చెందిన అసభ్యకరమైన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి . సదరు ఫొటోస్ లో ప్రియాంక ఓవర్ ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్స్ షాక్ అవ్వడంతో పాటు ప్రియాంక ఇలా మారిపోయిందేంటనే కామెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా సదరు పిక్స్ ని షేర్ కూడా చేస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం అవి ప్రియాంక ఫోటోలు కాదు. 'ఏఐ' తో చేసారని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ అభిమానుల నమ్మకమే నిజమయ్యింది. ఈ విషయంపై ప్రియాంక 'ఎక్స్' వేదికగా స్పందిస్తు 'ఏఐ'(AI)ద్వారా నన్ను తప్పుగా చూపిస్తు క్రియేట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫేక్ ఫోటోల్ని షేర్ చేయడం దయచేసి ఆపండి.

ఏఐ టెక్నాలజీని క్రియేవిటీ కోసం వాడుకోవాలి. తప్పుడు సమాచారం సృష్టించడానికి కాదు. మనం ఏది క్రియేట్ చేస్తున్నాం, ఏది షేర్ చేస్తున్నాం అనే దానిపట్ల జాగ్రత్త వహించాలని కొంచం కటువుగానే స్పందించింది. చెన్నై కి చెందిన ప్రియాంక నాచురల్ స్టార్ నాని(Nani)గ్యాంగ్ లీడర్ తో సినీ రంగ ప్రవేశం చేసి ఓజి వరకు తను చేసిన సినిమాలన్నిటిలో ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.