English | Telugu

క్షేత్రంలో ప్రియమణి జేజమ్మే

"క్షేత్రం" చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ప్రియమణి జేజమ్మేనంటున్నారు ఆ చిత్రం యూనిట్. వివరాల్లోకి వెళితే గతంలో ప్రముఖ సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వంలో, శ్యాం ప్రసాద రెడ్డి నిర్మించిన "అరుంధతి" చిత్రంలో హీరోయిన్ అనుష్క ధరించిన "జేజెమ్మ" పాత్ర ఎంతటి శక్తివంతమైనదో, ఆ పాత్రలో నటించిన తర్వాత అనుష్కకు ఎంతటి పేరు ప్రఖ్యాతులు లభించాయో అందరికీ తెలిసిందే.


అలాగే "క్షేత్రం" చిత్రంలో కూడా ప్రముఖ హీరోయిన్ ప్రియమణి అటువంటి శక్తివంతమైన పాత్రలోనే నటిస్తుందనీ ఈ "క్షేత్రం" చిత్రం యూనిట్ అంటూంది. ఈ చిత్రంలో ప్రియమణి పాత్ర పేరు "నాగ పెంచలమ్మ" అని తెలిసింది. ఈ చిత్రంలో ప్రియమణి జగపతి బాబు సరసన హీరోయిన్ గా నటిస్తూంది. ఈ చిత్రంలో జగపతి బాబు వీరనరసింహ రాయలుగా నటిస్తున్నారు. ఈ "క్షేత్రం" సినిమా ఏప్రెల్ ఆరవ తేదీ నుండి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకోనుంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.