English | Telugu

విశాఖలో నట్టి కుమార్ స్టుడియో నిర్మాణం

విశాఖలో నట్టి కుమార్ స్టుడియో నిర్మాణం చేపడుతున్నారట. వివరాల్లోకి వెళితే ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్టీల్ సిటి విశాఖపట్టణంలో ఒక సినిమా స్టుడియో నిర్మిస్తున్నారు. ఈ స్టుడియోకి యన్.కె. స్టుడియో అన్న పేరు నిర్ణయించారు. ఇప్పటికే నట్టి కుమార్ విశాఖపట్టణంలో దాదాపు 40 థియేటర్లకు పైగా యన్.కె.థియేటర్స్ పేరుతో లీజుకి తీసుకుని నడిపిస్తున్నారు. ప్రస్తుతం తాను నిర్మిస్తున్న ఈ ఫిలిం స్టుడియో పూర్తయ్యే సరికి దాదాపు రెండేళ్ళ సమయం పడుతుందని అన్నారు.


ఆయన ఇంకా ఈ స్టుడియోని అన్ని హంగులతోనూ, అన్ని సౌకర్యాలతోనూ నిర్మిస్తున్నామనీ, నిర్మాత, దర్శకులకు అవసరమైన అన్ని వసతులూ ఉండేలా నిర్మించటం జరుగుతుందనీ నట్టి కుమార్ మీడియాకు తెలియజేశారు. తానిప్పటి వరకూ అరవై సినిమాలను నిర్మించాననీ, ఇటీవల జగపతి బాబు హీరోగా నిర్మించిన "చట్టం" చిత్రానికి ప్రేక్షకుల నుండి అపూర్వమైన ఆదరణ లభిస్తూందనీ నట్టి కుమార్ అన్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.