English | Telugu

సెంచ్యురీ క్లబ్ లో జగపతి బాబు

సెంచ్యురీ క్లబ్ లో జగపతి బాబు చేరుతున్నారట. దీనర్థం జగపతి బాబు తెలుగు సినీ పరిశ్రమలో వంద సినిమాలు పూర్తిచేసిన హీరోల సరసన తన పేరు కూడా నమోదు చేసుకోబోతున్నాడట. ఇటివల "మహాత్మ" చిత్రంతో హీరో శ్రీకాంత్ వంద సినిమాలు పూర్తిచేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు హీరో జగపతిబాబు త్వరలో వంద సినిమాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఆ వందవ చిత్రానికి ఒక పెద్ద డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం.


ఈ చిత్రాన్ని విశాఖ టాకీస్ పతాకంపై నట్టి కుమార్ నిర్మించనున్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇటీవల నట్టి కుమార్ నిర్మాతగా ఆ బ్యానర్ లోనే జగపతిబాబు హీరోగా, విమలా రామన్ హీరోయిన్ గా, అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన "చట్టం" చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.జగపతి బాబు నంటించబోయే వందవ చిత్రం చాలా భారీగా ఉండబోతుందని, ఈ చిత్రం 2011 ఆగస్టు నెలలో ప్రారంభం కావచ్చని అనుకుంటున్నారు. జగపతి బాబు హీరోగా నటించిన తొలి చిత్రం"అభిమన్యుడు".

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.