English | Telugu

హాట్ టాపిక్ గా మారిన అతడి పెళ్లి

టాలీవుడ్ లో పెళ్లి కానీ హీరోలలో ప్రభాస్ ఇపుడు ముందు స్థానంలో ఉన్నాడు. అయితే ప్రభాస్ కోసం తన ఇంట్లో ఓ మంచి సంబంధాన్ని కూడా చూసారని తెలిసింది. ప్రభాస్ పెళ్లి కోసం తన కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి మాత్రం రాజమౌళి చేతిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "బాహుబలి" చిత్రంలో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్రం కోసం ప్రభాస్ తన బరువును 150 కిలోల వరకు పెంచేసాడు. పైగా సినిమాలోని తన పాత్ర కోసం గడ్డాలు, మీసాలు భారీగా పెంచేసాడు. పైగా ఈ సినిమా 2015 లో పూర్తి అవుతుందని రాజమౌళి స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసాడు. దాంతో ప్రభాస్ కుటుంబ సభ్యులు అంతవరకు వేచి ఉండలేమని అనడంతో ప్రభాస్ పెళ్ళికి జక్కన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. కానీ ప్రభాస్ తన పెళ్లిలో కూడా "బాహుబలి" గెటప్ లో ఉంటాడా లేక "మిర్చి" ప్రభాస్ గెటప్ లో కనిపిస్తాడా అనేది హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని విషయాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.