English | Telugu
సర్వ కళావల్లవన్ గా విష్ణు
Updated : Nov 5, 2013
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం "దూసుకెళ్తా". ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని మలయాళం భాషలోకి డబ్బింగ్ చేసి ఈ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ మలయాళ డబ్బింగ్ చిత్రానికి "సర్వ కళావల్లవన్" అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో విష్ణు సరసన లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి వీరుపోట్ల దర్శకత్వం వహించాడు. మరి ఈ చిత్రం మలయాళంలో ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనున్నది.