English | Telugu

సరైన ప్లానింగ్ లేని ఓం రౌత్

తానాజీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఓంరౌత్ దిశ‌ నిర్దేశం లేకుండా సాగుతున్నారు. ఆయనకు ప్రభాస్ డేట్స్ లభించడం చూస్తే క‌ల్లు తాగిన కోతి గుర్తుకు వస్తుంది. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదు. సినిమా ప్రారంభించి ఎంతో కాలమైంది. ఆ మధ్య టీజర్ ను విడుదల చేస్తే దానిపై తీవ్ర నెగెటివిటీ వచ్చింది. దాంతో మరల విఎఫ్ ఎక్స్ పనులను 100 కోట్ల బడ్జెట్లో చేస్తున్నారు. అయినా కూడా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది.

పక్కా ప్రణాళిక ప్రకారం లేక పోవడమే ఈ గందరగోళానికి అసలు కారణం. అదే సమయంలో ప్రాజెక్టుకే విషయానికి వస్తే సీనియర్ నిర్మాత అశ్విని దత్ ప్రతి విషయంలోనూ క్లారిటీగా ఉన్నారు. సినిమా ప్రారంభించి షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మరోవైపు గత ఐదు నెలలుగా విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రిలీజ్ డేట్ ను కూడా వచ్చే సంక్రాంతికి జనవరి 12న ప్రకటించారు. ఇలా ఏడాదిన్నర ముందు నుంచే విఎఫ్ఎక్స్ పనులను ప్రారంభించి ఒక పద్ధతిలో షూటింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఓం రౌత్ మాత్రం గుడ్డెద్దు చేలో పడినట్టు ప్రభాస్ డేట్స్ హీరోయిన్ల డేట్స్ దొరికాయి కదా అని ఓ సినిమా తీసి జ‌నాల మీద‌కు వ‌దిలే ప్ర‌య‌త్నం చేస్తున్నాడేగానీ సినిమాను విజ‌య‌వంతంగా తీర్చిదిద్దే ప్లానింగ్ లేకపోవడమే ఆది పురుష్‌కి అతి పెద్ద శాపంగా మిగులుతుంది.

ఇంకా ఆయన ప్రభాస్ అభిమానుల నుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ చిత్రంలో సీత పాత్రలో కృతిస‌న‌న్, రావణుడివి పాత్రలో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, ఆంజనేయుడు పాత్రలో దేవదత్త నాగే వంటి వారు నటిస్తున్నారు. టీజర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. మొత్తానికి ప్రాజెక్టుకేతో పోలిస్తే ఆది పురుష్ చిత్రం ఏమాత్రం ముందు చూపు లేని ప్రాజెక్టుగా రూపొందుతోంది. దాంతో ఈ సినిమాపై అభిమానులకు కూడా పెద్దగా ఆశలు లేవు. ఒకవైపుమైథ‌లాజిక‌ల్ సబ్జెక్టు కావడం సినిమా వాయిదాల మీద వాయిదాలు ప‌డ‌టం ఇలాచిత్రం ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తిని రేకెత్తించలేకపోతోంది. అదే సమయంలో ప్రాజెక్టుకి స‌లార్ వంటి చిత్రాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు.

దానికి కారణం ఆయా చిత్రాల సబ్జెక్టులతో పాటు ప్లానింగ్ గా ముందుకు వెళ్లడం క్రేజీ డైరెక్టర్స్ ఉండడమే దీనికి కారణం. అది ఆదిపరుష్కి పూర్తిగా లోపించింది. దాంతో ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు దాదాపు ఆశలు వదిలేసుకున్నారు అని చెప్పాలి. ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధిస్తే మాత్రం అది పెద్ద వండర్ గా చెప్పుకోవాల్సి వస్తుంది. ప్లానింగ్ లేక పోవడమే ఆది పురుష్కు అతి పెద్ద శాపంగా ప‌రిణ‌మించింది.