English | Telugu
ఎప్పుడు సంయుక్తానేనా... మావైపు కూడా చూడండి గురూజీ!
Updated : Feb 26, 2023
దర్శకుడు అన్న తర్వాత వారికి హీరో హీరోయిన్లతో చనువుంటుంది. తమ ఇంటి కుటుంబ సభ్యుల్లా వారిని చూసుకుంటే సినిమా అవుట్ ఫుట్ కూడా అంత బాగా వస్తుంది. వారిని తమ సొంత మనుషులుగా భావిస్తే ప్రొడక్ట్ కు ఉపయోగపడుతుంది. త్రివిక్రమ్ అదే చేస్తారు. తనతో సినిమాలు చేసిన హీరోయిన్లను ప్రేమిస్తాడు. వారిని సర్వంగా భావిస్తూ వారి పాత్రను అద్భుతంగా తెరకెక్కిస్తారు. హీరోయిన్ పాత్రలు జనానికి గుర్తుండిపోయేలా చేస్తారు. ఆ పాత్రలను అంతగా ప్రేమిస్తారు కాబట్టే ఆ పాత్రలో హీరోయిన్లను కూడా అంతగా ప్రేమిస్తారు. ఇక అతను తెర ముందు, వెనుక మాటల మాంత్రికుడు కానీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం రొమాంటిక్ హీరో అంటున్నారు. ఆయనపై సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. చాలామంది హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడంటూ ప్రచారాలు కూడా జరిగాయి. ఆ రూమర్స్‌లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు.
మనోడి తీరు నడవడిక చూస్తే అతని మీద వచ్చిన రూమర్స్ నిజమేనేమో అని అంటున్నారు. ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే తోటి సినిమాలు చేశారు. అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో తో పాటు రీసెంట్‌గా మహేష్ మూవీలో కూడా ఆమెనే హీరోయిన్‌గా నటిస్తుంది. పూజా హెగ్డే తో పాటు మలయాళం స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ తో కూడా మనోడు సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. భీమ్లా నాయక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా ఈ అమ్మడు ఆ తర్వాత బింబిసారా , సార్ వంటి సూపర్ హిట్స్ సినిమాలలో నటించింది. రెండు సినిమాలకు త్రివిక్రమ్ పనిచేశారు. భీమ్లానాయక్ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్ గా వ్యవహరించారు. సార్ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించారు. ఈ రెండు సినిమాల్లో ఆమెకు హీరోయిన్‌గా అవకాశం రావడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణమని సోషల్ మీడియాలో రూమర్ ఉంది. సార్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా సంయుక్తమీనన్‌కు ఐ లవ్ యు అంటూ సంచలనం రేపారు.
దామిని విల్లా సినిమాలో హీరోయిన్‌గా నటించిన రేఖ బోజ్ త్రివిక్రమ్ సంయుక్త మధ్య ఉన్న సీక్రెట్ ఎఫైర్ గురించి కొన్ని కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఇవి హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడు ఆ మలయాళీ మీద మాత్రమే కాదు గురూజీ మాలాంటి వాళ్లను కూడా పట్టించుకోండి అని ట్వీట్ చేసింది. దాని కింద నెటిజన్స్ ఎవరు అని అడగ్గా దానికి రేఖా బోజ్ సమాధానం ఇస్తూ ఇంకెవరు రీసెంట్‌గా మన గురూజీ చల్లని చూపులు దక్కించుకున్న సంయుక్త మీనన్ అని రిప్లై ఇచ్చింది. ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది దీనిపై త్రివిక్రమ్ అండ్ టీం ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి వుంది.