English | Telugu

పవన్ ‘ఇజం’పై వర్మ విసుర్లు

పవన్ కళ్యాణ్‌ని ఎంతగానో అభిమానించే రామ్ గోపాల్ వర్మకి కూడా ‘ఇజం’ పుస్తకంలో ఏం రాశారో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. ప్రపంచంలో చాలా కాంప్లికేట్‌గా వుండే సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకునే శక్తి వుండటంతోపాటు ఎన్నో పుస్తకాలు చదివిన తనకి ఈ పుస్తకం ఎంతమాత్రం అర్థం కాలేదని ట్విట్టర్‌లో వర్మ మొత్తుకుంటున్నాడు. ఈ పుస్తకాన్ని తాను చదవడానికి శాయశక్తులా ప్రయత్నించానని, తనకి ఎంతమాత్రం అర్థం కాలేదని, ఒక పట్టాన కొరుకుడు పడలేదని వర్మ అన్నాడు. అసలు ఈ పుస్తకాన్ని రాసిన రాజు రవితేజ్‌కైనా ఈ పుస్తకం అర్థమై ఉంటుందని అనుకోనని వర్మ అన్నాడు. పుస్తకం రాసిన రచయితకే అర్థమై వుంటుందా అనే డౌట్ క్రియేట్ చేసిన పుస్తకం మనలాంటి సామాన్యులకు అర్థమవుతుందంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తేలియజేయండి.