English | Telugu
డిసెంబర్ లో ఎన్టీఆర్ కొత్త సినిమా
Updated : Nov 4, 2013
"మిర్చి" చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ. అయితే శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా బ్యానర్ లో డి.వి.వి.దానయ్య నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో శివ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు.
ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.