English | Telugu

మహేష్ తండ్రిని మార్చేసిన శ్రీను

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఆగడు".14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించనున్నది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన "దూకుడు" చిత్రంలో మహేష్ తండ్రిగా తనదైన శైలిలో నటించి మార్కులు సంపాదించుకున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. అయితే "ఆగడు" చిత్రంలో మహేష్ తండ్రిగా నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్ ను ఎంపిక చేసుకున్నారు శ్రీనువైట్ల. మరి రాజేంద్రప్రసాద్ తనదైన శైలిలో ఎలాంటి నటించి ఈ సినిమా విజయానికి ఎంతవరకు న్యాయం చేయగలడో త్వరలోనే తెలియనుంది.