English | Telugu

ఎన్టీఆర్ 'రభస' విడుదల వాయిదా?

యంగ్ టైగర్ లేటెస్ట్ మూవీ 'రభస' విడుదల వాయిదా పడిందా? ఈ సినిమా ఆగస్ట్ 15న కాకుండా 28న విడుదల చేస్తున్నారా? తాజా సమాచారం ప్రకారం..ఎన్టీఆర్ రభస మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బెల్లంకొండ సురేష్ కొడుకు నటించిన 'అల్లుడు శ్రీను' సినిమా ప్రస్తుతం 'బిసీ' సెంటర్లలో మంచి బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు సడన్ గా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేస్తే తమకు భారీగా నష్టాలు వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత సురేష్ కి విజ్ఞప్తి చేశారట. దీంతో ఆయన 'రభస' వాయిదా వేయాలనే ఆలోచనలో వున్నారని అంటున్నారు. కానీ ఈ సినిమా వాయిదాపైన నిర్మాతల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే బెల్లంకొండా సురేష్ తన కొడుకు కోసం ఎన్టీఆర్ సినిమాని అపుతాడా లేక రిలీజ్ చేస్తారా అనేది వేచిచూడాలి!