English | Telugu
ఆమె ఖరీదు ఆరున్నర కోట్లు...!
Updated : Jan 23, 2014
లక్స్ పాప గా అప్పట్లో హాల్ చల్ చేసిన హాట్ భామ ఆశాసైనీకి కోర్టులో అవమానం జరిగింది. అసలే సినిమాలు లేక ఉన్న ఆశా.. తన అందాలతో అప్పట్లో సినీ నిర్మాత గౌరంగ్ దోషిని పడేసింది. ఆ నిర్మాతతో సహజీవనం చేసిన ఆశా.. తనను గౌరంగ్ శారీరకంగా చాలా వేధించాడంటూ అప్పట్లోనే కోర్టుకెక్కింది. తనకు నష్టపరిహారంగా ఆరున్నర కోట్ల రూపాయలు ఇప్పించాలంటూ ఫిర్యాదు చేసింది. అయితే ఆ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ... అతనికి వివాహమైందని తెలిసి కూడా అతనితో సహజీవనం చేసిన కారణంగా మీ పిటిషన్ చెల్లదు అంటూ న్యాయస్థానం తీర్పునివ్వడంతో ఆ నిర్మాత నిర్దోషిగా బయటపడ్డాడు. కానీ ఆశాకే నష్టపరిహారం రాకపోగా.. ఇప్పటివరకు తన లాయర్ కు పెట్టిన ఖర్చు కూడా తడిసిమోపెడయ్యింది.