English | Telugu
ఫ్రెండ్‌షిప్ కోసం అవన్నీ చేశా - కరీనా
Updated : Jun 25, 2014
బాలీవుడ్ పాపులర్ నటి కరీనా ఫ్రెండ్‌షిప్ కోసం చాలా చిత్రాలు చేశాను. ఇకపై మంచి కథ వుంటేనే చేస్తాను అని అంటోంది. పెళ్లైన తర్వాత కూడా నెంబర్ వన్ రేస్‌లో కొనసాగుతున్న కరీనా కమర్షియల్ హిట్స్ ఎన్నో సొంతం చేసుకుంది. కభీ ఖుషీ కభీ గమ్, 3 ఇడియట్స్, బాడీగార్డ్ లాంటి కమర్షియల్ చిత్రాలతో పాటు ఓంకార, చమేలీ, రెఫ్యూజీ లాంటి ఆఫ్‌బీట్ చిత్రాలలోను నటించి మెప్పించింది కరీనా. అందం, టాలెంట్‌తో పాటు కావలిసినంత పాపులారిటీ వున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఇకపై మంచి స్టోరీ చిత్రాలకు మాత్రమే ప్రాధన్యతనిస్తానంటోంది. గతంలో ఫ్రెండ్‌షిప్ కోసం కొన్ని చిత్రాలు చేశానని, అవి చేసినందుకు తానేం బాధపడటంలేదని చెప్పుకొచ్చింది. అయితే కమర్షియల్ చిత్రాలతో పాటు, నటనకు ప్రాధన్యత వున్న పాత్రలు చేస్తూ తన కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకున్నాని కరీనా తెలిపింది. కరీనా ఇలా స్టోరీకి ప్రాముఖ్యతనిస్తానటంతో కమర్షియల్ సినిమాలకు ఆమె ఎక్కడ దూరం అవుతుందేమోనని అభిమానులు కంగారు పడుతున్నారు.