English | Telugu

దేవుడా.. యాభైలక్షలమంది అభిమానులు


హై ఎనర్జీతో స్క్రీన్ మీద చెలరేగిపోయి యంగ్ హీరో అల్లూ అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆ రేంజ్ లోనే వుంది. ఆయన ఫేస్‌బుక్ పేజ్‌కి యాభై లక్షల మంది అభిమానులున్నారు. సౌత్‌లో అత్యధిక ఫేస్‌బుక్ ఫాలోయింగ్ వున్న స్టార్‌గా రికార్డు సృష్టించారు అల్లూ అర్జున్. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆయన పేజ్‌ని లైక్ చేసిన అభిమానులకు ఈ సందర్భంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ పేజ్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న ఏఏ టీంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మధ్యే తండ్రయిన అర్జున్, కొడుకు పుట్టినందుకు శుభాకాంక్షలు తెలిపిన వారికి కూడా ధన్యవాదాలు చెప్పారు. త్వరలోనే జూ.బన్నీ ఫోటోని విడుదల చేస్తామని తెలిపాడు. రీసెంట్‌గా అల్లూ అర్జున్ నటించిన రేసుగుర్రం చిత్రం మంచి కలెక్షన్లు సాధించింది. అంతే కాదు మన స్టైలిష్ స్టార్‌కి పక్క రాష్ట్రాలలో కూడా బాగానే ఫాలోయింగ్ వుంది. ఈ అభిమానం ఇలాగే కొనసాగలని బన్నీ ఈ వీడియోలో అభిమానులను కోరారు.