English | Telugu
పాటతో కాదు.. అందాలతో మత్తెక్కించింది.
Updated : Dec 20, 2013
మహేష్ నటించిన "1" ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమం అంతా ఒకవైపు అయితే... నేహ బాసిన్ అందాల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆడియో విడుదల కార్యక్రమంలో అందాల ప్రదర్శన ఏంటి అని అనుకుంటున్నారా?
మీకు "కరెంట్" సినిమాలో "అటు నువ్వే..ఇటు నువ్వే", "దడ"లో "హలో హలో లైలా.." వంటి మత్తెక్కించే పాటలు గుర్తున్నాయా? ఆ పాటలను పడింది కత్తిలాంటి సింగర్ నేహా బాసిన్. నేహా తన పాటలతోనే పిచ్చేక్కిస్తుందని ఇంతకాలం అనుకున్నాం. కానీ తన అందాల సోయగాలతో కూడా పిచ్చెక్కించగలదని నిన్ననే ఋజువుచేసింది. నిన్న జరిగిన "1" ఆడియో విడుదల కార్యక్రమంలో ఈ అమ్మడు తను సినిమాలో పాడిన "ఆవ్ తుజే మోగ్ కోర్తా" అనే పాటను స్టేజ్ మీద పడి హుషారు చేసింది.
అయితే ఈ అమ్మడు వేసుకొచ్చిన డ్రెస్సుతో తన అందాలను భారీగా ప్రదర్శిస్తూ.. పొట్టి గౌనులో తన ఒంపుసొంపులతో మతిపోగొట్టేసింది. నిజానికి అందరూ ఈపాటను ఎంజాయ్ చేయడం కంటే.. ఈ భామ యొక్క అందాలను చూడటంలోనే తెగ ఎంజాయ్ చేసారు. త్వరలో ఈ అమ్మడు ఏదైనా ఐటెం సాంగ్ లో కనిపించిన కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.