English | Telugu

శివుడికి జోడిగా మిల్క్ బ్యూటీ

ప్రభాస్ తో "రెబెల్" చిత్రంలో రొమాన్స్ చేసిన మిల్క్ బ్యూటీ తమన్నా.. మరోసారి ప్రభాస్ చెంతకు చేరింది. ప్రభాస్ నటిస్తున్న "బాహుబలి" చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజాగా తమన్నాను కూడా మరో హీరోయిన్ గా ఎంపిక చేసారు. నేడు తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా "బాహుబలి" చిత్ర దర్శక, నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్ర పేరు బాహుబలి. బహుబలికి జోడిగా అనుష్క నటిస్తుంది. మరొకటి శివుడు. శివుడుకు జోడిగా తమన్నాను ఎంపిక చేసారు. ఈనెల 23నుంచి రామోజీఫిల్మ్ సిటీలో భారీ యుద్ధ సన్నివేశాన్ని మర్చి 5 వరకు చిత్రీకరించనున్నట్లు తెలిపారు.